శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (08:48 IST)

ఓట్ల లెక్కింపు : గుజరాత్‌లో బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్కంఠ

gujarat election
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసి, ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
 
అయితే, ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రానుండగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉండగా, 1621 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు ఆరు చోట్ల గెలుపొందారు.
himachal pradesh election
 
హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 35. 412 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 44 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోమారు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. 
 
ప్రాథమిక అంచనాల మేరకు గుజరాత్‌లో బీజేపీ 100, కాంగ్రెస్ 24, ఆప్ 3 చోట్ల ఆధిక్యంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 14, కాంగ్రెస్ 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.