మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (17:52 IST)

గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, గుజరాత్‌లో చరిత్ర, 27 ఏళ్లపాటు...

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 18వ తేదీ సోమవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఫలితాల్లో ఓటరు తీర్పు దాదాపుగా తెలిసిపోతోంది. జీఎస్టీ బిల్లు అమలు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఓటర్లు ఏ విధంగా తీర్పునిచ్చారన్న విషయంపై ఆసక్తి నెలకొన్నప్పటికీ, అది భాజపాకే అనుకూలంగా వున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గుజరాత్‌లో బీజేపీ 22 యేళ్లుగా అధికారంలో ఉంటే, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా పశ్చిమ బెంగాల్లో వరుసగా 25 ఏళ్లపాటు అధికారంలో కొనసాగిన లెఫ్ట్ పార్టీలు చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఆ చరిత్రను తిరగరాసింది. దేశంలోనే తొలిసారిగా వరుసగా 27 ఏళ్లపాటు అధికారంలో వున్న పార్టీగా చరిత్ర సృష్టించింది.
గుజరాత్
PARTIES LEADS WON TOTAL
భాజపా 0 99 99
కాంగ్రెస్ 0 80 80
ఇతరులు 0 3 3

హిమాచల్ ప్రదేశ్
PARTIES LEADS WON TOTAL
భాజపా 0 44 44
కాంగ్రెస్ 0 21 21
ఇతరులు 0 3 3