శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (18:01 IST)

తెలుగు లైవ్ : గుజరాత్ పోల్ ఫైనల్ రిజల్ట్స్...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార భాజపాకు గట్టి పోటీ ఇచ్చింది. ఐతే ప్రధాని నరేంద్ర మోడీ హవా గుజరాత్‌లోనూ కొనసాగటంతో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మొత్తం 182 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 92 సీట్లు కావాలి. కాగా భాజపా 99 సీట్లు సాధించి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 80 చోట్ల, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు.
PARTIES LEADS WON TOTAL
Total     182
BJP   99 99
Congress   80 80
Others   03 03