సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (13:36 IST)

ఈపాడులోకం కలిసి బతకనివ్వట్లేదు.. ఈలోకాన్ని విడిచిపోతున్నాం....

మా ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పటికీ తమను ఈ పాడులోకం కలిసి బతకనివ్వడం లేదని పేర్కొంటూ ఓ లెస్బియన్ జంట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. సబర్మతీ నదిలో దూకి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. వీరితోపాటు ఓ పసిబిడ్డన

మా ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పటికీ తమను ఈ పాడులోకం కలిసి బతకనివ్వడం లేదని పేర్కొంటూ ఓ లెస్బియన్ జంట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. సబర్మతీ నదిలో దూకి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. వీరితోపాటు ఓ పసిబిడ్డను కూడా తీసుకెళ్లారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదేప్రాంతానికి చెందిన భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. వీరిద్దరి భర్తలూ దూరమయ్యారు. దీంతో ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఇద్దరూ కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ, త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. 
 
అయితే గ్రామ పెద్దలు మాత్రం వీరికి అడ్డుచెప్పారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు. 
 
సోమవారం సబర్మతి నదీ తీరంలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చిందని గుజారీ బజార్‌ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా, మరో శవంతో పాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గుర్తించారు. కానీ ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. 
 
వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేముందు 'కలిసి బతికేందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాం. మాకు ఏ మగతోడు లేదు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి దగ్గరయ్యాం. కానీ, ఆ సమాజం మమల్ని ఒక్కటిగా బతకనివ్వట్లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం. బహుశా ఇక మేం ఒకటిగా బతికేది వచ్చే జన్మలోనే' అంటూ సూసైడ్‌‌లో రాసిపెట్టారు.