శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (08:47 IST)

నా బిడ్డ నోరు నొక్కిపెట్టి.. 4 గంటల పాటు రేప్ చేశారు.. బాధితురాలి కన్నీటి గాథ

దేశ రాజధానికి సమీపంలో ఉన్న గుర్గావ్‌లో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 నెలల పాప నోరు నొక్కిపెట్టి.. మహిళపై ఇద్దరు కామాంధులు నాలుగు గంటల పాటు సామూహిక అత్యాచారం

దేశ రాజధానికి సమీపంలో ఉన్న గుర్గావ్‌లో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 నెలల పాప నోరు నొక్కిపెట్టి.. మహిళపై ఇద్దరు కామాంధులు నాలుగు గంటల పాటు సామూహిక అత్యాచారం జరిపినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటీవల ఢిల్లీ, గుర్గావ్‍కు సమీపంలో 9 నెలల పాపతో వెళ్తున్న 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు... ముగ్గురు నిందితుల్లో యోగేంద్ర, అమిత్ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మూడో నిందితుడైన టెంపో డ్రైవర్‌ జేకేష్‌ పరారీలో ఉండగా, అతని కోసం గాలిస్తున్నారు. 
 
కాగా, ఈ గ్యాంగ్ రేప్‌ కేసులో బాధితురాలు సంచలన విషయాన్ని వెల్లడించింది. అత్యాచారం జరిగిన రోజు అర్థరాత్రి సమయంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లడానికి 9 నెలలో పాపతో బయటకు వచ్చాను. తొలుత ఒక ట్రక్కు ఎక్కగా, ఆ ట్రక్కు డ్రైవర్‌ నన్ను లైంగికంగా వేధించాడు. నేను ప్రతిఘటించడంతో జాతీయ రహదారి 8పై వదిలివేసి వెళ్లిపోయాడు. 
 
అంతలో ఒక టెంపో నా వద్దకు వచ్చి ఆగింది. అందులో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు బాగా తాగేసి ఉన్నారు. నాపై దాడి చేశారు. పెనుగులాటకు నా కూతురు పెద్దగా ఏడవటంతో... పాప నోరు నొక్కిపెట్టారు. అయినా ఏడుస్తుండడంతో విసిరిపారేశారు. కాళ్లావేళ్లా పడి బతిమాలుకున్నా కనికరించలేదు. రోడ్డు మీద 4 గంటలపాటు అత్యాచారం చేశారు. వాళ్లు వెళ్లిపోయాక ఓపిక తెచ్చుకుని లేచి పాపను భుజాన వేసుకుని గుర్గావ్‌లోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యులు పాపను చూసి.. చనిపోయిందని చెప్పారంటూ బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.