శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (11:39 IST)

అపార్ట్‌మెంట్‌లో విదేశీ యువతితో యువకుడు.. ఖాళీ చేయించిన అసోసియేషన్

పెళ్లి కాని యువతీ, యువకులు ఒకే అపార్ట్‌మెంట్‌లో కలసి ఉండరాదనే నిబంధనను తాము అమలు చేస్తున్నామని పేర్కొంటూ పెళ్లి కాని యువకుడి ఫ్లాట్‌లో నివాసమున్న ఓ విదేశీ యువతిని బయటకు పంపించిన ఉదంతం గుర్గావ్ నగరంలో

పెళ్లి కాని యువతీ, యువకులు ఒకే అపార్ట్‌మెంట్‌లో కలసి ఉండరాదనే నిబంధనను తాము అమలు చేస్తున్నామని పేర్కొంటూ పెళ్లి కాని యువకుడి ఫ్లాట్‌లో నివాసమున్న ఓ విదేశీ యువతిని బయటకు పంపించిన ఉదంతం గుర్గావ్ నగరంలో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే బార్సీలోనాకు చెందిన కార్లోటా బుర్రెల్ మాస్ అనే 24 ఏళ్ల అమ్మాయి ఢిల్లీలోని మానవహక్కుల సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు వచ్చింది. బుర్రెల్ ఢిల్లీలో తన స్నేహితుడైన మొహిత్ అగర్వాల్ ఫ్లాట్‌లో కొన్నాళ్లు ఉందామనుకుంది. ఎంఎన్సీ కంపెనీ కన్సల్టెంట్ అయిన మొహిత్ అగర్వాల్ గుర్గావ్‌లోని ఆర్ధీ సిటీలోని సెక్టారు 52 పామ్ గ్రోవ్ హైట్స్ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు.
 
దీంతో బుర్రెల్ మొహిత్ అపార్టుమెంట్‌కు వెళ్లగా ఆమెను లోపలకు వెళ్లకుండా అక్కడి సెక్యూరిటీ గార్డు గేటు దగ్గరే అడ్డుకున్నాడు. పెళ్లికాని యువతీ, యువకులు కలిసి ఉండటాన్ని అపార్టుమెంట్ సొసైటీ నిబంధనలు అంగీకరించవని చెపుతూ బుర్రెల్‌ను అనుమతివ్వలేదు. మొహిత్ ఎస్టేట్ మేనేజరు సంజయ్ చౌదరిని సంప్రదించగా తమ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పెట్టుకున్న నిబంధనలని, వాటిని సడలించలేమని స్పష్టం చేశారు. 
 
దీంతో మరో మార్గం లేక ఢిల్లీలోని రామకృష్ణ ఆశ్రమంలో అతిథిగా ఉంటోంది. ‘‘నా మొదటి ఇండియా పర్యటనలోనే స్నేహితుడి ఇంటినుంచి గెంటివేయడం అవమానకరం’’అని బుర్రెల్ అనే బార్సీలోనా యువతి అన్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు కలిసి ఉండరాదనేది తమ సొసైటీ నిబంధన అని ఈ విషయంలో ఇకముందు ఎలాంటి వినతులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేస్తూ చౌదరి అసోసియేషన్ పేరిట బోర్డు పెట్టడం విశేషం.