గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (08:36 IST)

ఇకపై అలా కుదరదు.. రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్‌లో ఎక్కాల్సిందే...

train
ఒక స్టేషన్‌లో ఎక్కి ప్రయాణం చేసేందుకు రిజర్వేషన్ చేసుకునే అనేక మంది ప్రయాణికులు... తాము రిజర్వేషన్ చేసుకున్న రైల్వే స్టేషన్‌లో ఎక్కకుండా, తర్వాత స్టేషన్‌లో ఎక్కుతుంటారు. అయితే, ఇక నుంచి అది సాధ్యపడదు. మీరు రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్‌లో ఎక్కాల్సివుంటుంది. లేని పక్షంలో మీ బర్త్ లేదా సీటును మరో ఆర్ఏసీ లేదా వెయిట్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుడికి కేటాయిస్తారు. ఆ తర్వాత మీరు టీటీవీని ప్రశ్నించినా మీకు సీటు కేచాయించడం సాధ్యం కాదు. 
 
గతంలో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) వద్ద రిజర్వేషన్ ప్రయాణికులు ప్రింటెడ్ చార్ట్ ఉండేది. దీంతో ఒకటి రెండు స్టేషన్ల వరుక ప్రయాణికులు రాకపోకలు వారు వేచి చూసేవారు. ఇపుడు అలాంటి అవకాశం లేదు. వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే బోర్డింగ్ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది. 
 
దీనికి కారణం ప్రస్తుతం టీటీఈ వద్ద హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (ట్యాబ్స్) ఉన్నాయి. వీటిలోనే ప్రయాణికుల వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిలో వివరాలు ఎప్పటికపుడు అప్‌లోడ్ అవుతుంటాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్తులు కేటాయించే వీలుంటుంది.