గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:13 IST)

హనీప్రీత్ అరెస్ట్ వెనుక ఏదో మతలబు ఉంది : మనోహర్ లాల్

డేరా చీఫ్ డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్టు వెనుక ఏదో మతలబు ఉందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సందేహం వ్యక్తం చేశారు. హనీప్రీత్ గురించిన ప్రతి కదలిక పంజాబ్ రాష్ట్ర పోలీసులకు తె

డేరా చీఫ్ డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్టు వెనుక ఏదో మతలబు ఉందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సందేహం వ్యక్తం చేశారు. హనీప్రీత్ గురించిన ప్రతి కదలిక పంజాబ్ రాష్ట్ర పోలీసులకు తెలుసని ఆయన ఆరోపించారు. 
 
హనీప్రీత్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన హర్యానా పోలీసులకు అప్పగించిన విషయం తెల్సిందే. దీనిపై మనోహర్ లాల్ స్పందిస్తూ... 'దాల్ మే కుచ్ కాలా హై' (అనుమానించదగ్గ విషయం ఉంది) అని అన్నారు. 
 
పంజాబ్ పోలీసులకు హనీప్రీత్ గురించి సర్వమూ తెలుసునని, వారు తమతో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. పోలీసులు హనీప్రీత్‌ను ట్రాక్ చేశారని, తమకు విషయం తెలిపితే ఆమెను మరింత త్వరగా పట్టుకుని ఉండేవాళ్లని చెప్పారు. తమ ప్రమేయం లేనందునే అరెస్ట్ ఆలస్యం అయిందని అన్నారు.