శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:07 IST)

యువకులతో ఇంట్లో అసభ్యకర భంగిమలో చెల్లి.. చంపేసిన సోదరులు

హర్యానా రాష్ట్రంలో తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు సోదరులు కలిసి పరువు హత్య చేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు కొందరు యువకులతో కలిసి అభ్యంతర భంగిమలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేని ఆ ముగ్గురు సోదరులు ఆగ్

హర్యానా రాష్ట్రంలో తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు సోదరులు కలిసి పరువు హత్య చేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు కొందరు యువకులతో కలిసి అభ్యంతర భంగిమలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేని ఆ ముగ్గురు సోదరులు ఆగ్రహంతో రగిలిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ జిల్లా బిధాల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రీతి ఇంట్లోనే కొందరు యువకులతో అభ్యంతరకరమైన రీతిలో ఉండటాన్ని తన ముగ్గురు సోదరులు చూశారు. అంతే... ఆగ్రహించిన ముగ్గురు సోదరులు ముకేష్, సందీప్, సోనులు చెల్లెలైన ప్రీతికి విషం ఇచ్చి హతమార్చారు. ఆపై చెల్లెలు మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా దహనం చేశారు. ఈ ఘటనపై బుధియా గ్రామ సర్పంచి ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన పోలీసులు నిందితులైన ముకేష్, సందీప్ లను అరెస్టు చేశారు.