శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (14:18 IST)

Heartbreaking video : చనిపోతూ కూడా బిడ్డకు పాలు పట్టేందుకు..

భోపాల్‌లో ఓ హృదయ విదారక ఘటన ఒకటి జరిగింది. తాను చనిపోతూ కూడా బిడ్డకు ఆకలి తీర్చేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కర

భోపాల్‌లో ఓ హృదయ విదారక ఘటన ఒకటి జరిగింది. తాను చనిపోతూ కూడా బిడ్డకు ఆకలి తీర్చేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చిందోనని చలించిపోతున్నారు. పైగా, ఈ వీడియోను చూస్తే హృదయం ద్రవించుకపోకతప్పదు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో రైలు పట్టాల పక్కన ఓ వివాహిత మృతదేహం పడివుంది. ఆ మృతదేహం పక్కనే ఓ యేడాది వయసున్న చిన్నారి ఏడుస్తున్నాడు. తల్లి చనిపోయిందన్న విషయం బిడ్డకు తెలియదు. అందుకే ఆకలితో ఏడ్చిఏడ్చి అలమటించిపోయాడు. చివరకు తల్లి పాలను తాగేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. 
 
ఆ మహిళ చనిపోయిందన్న విషయం తెలియని వారంతా బిడ్డను ఆటపట్టించేందుకు ఆ తల్లి కళ్లుమూసుకునివుందని భావించారు. కానీ, ఆ తల్లి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బిడ్డా తల్లి రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె ట్రైన్‌లో నుంచి పడిపోయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు స్పృహలో ఉండొచ్చని, ఆ సమయంలోనే పిల్లాడికి పాలు తాగించేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అక్కడున్న అధికారులు భావిస్తున్నారు. తను చనిపోతూ కూడా బిడ్డ ఆకలి తీర్చాలనుకున్న ఈ తల్లి చనిపోవడం పట్ల వీడియో చూసిన ప్రతీ ఒక్కరి హృదయం ద్రవించుక పోతోంది.