శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (08:59 IST)

బ్లాక్ డే : దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం పాతబస్తీలో 150 మంది ఎస్సైలు, 50 సీఐలు, 20 ప్లాటూన్ల బలగాలతో పాటు అదనపు పోలీసులను నియమించారు. దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
బ్లాక్ డే సందర్భంగా నగరంలో చాలా చోట్ల ఆంక్షలు విధించారు పోలీసులు. దేశంలోని ప్రధాన నగరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టారు. మతఘర్షణలు సృష్టించే శక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు పోలీసులు.
 
పాతబస్తీలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు… ఆయా ఏరియాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం నగరంలో ఉన్న 3500 మంది పోలీసు బలగాలతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ లను ఏర్పాటు చేశారు.