శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:14 IST)

సహజీవనం చేసిన యూట్యూబర్లు.. అలా భవనం నుంచి దూకేశారు..?

suicide
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో నివసిస్తున్న జంట ఆత్మహత్యకు పాల్పడింది. సహజీవనం చేస్తున్న ఈ జంటను గ్రావిట్ (25), నందిని (22) యూట్యూబర్‌లుగా గుర్తించారు. వారు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
 
యూట్యూబర్లు అలా వారి జీవితాలను ముగించుకునేందుకు గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. వారుండే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు రుహిల్ రెసిడెన్సీ సొసైటీలోని ఫ్లాట్ నంబర్ 701లో నివసిస్తున్నారు. 
 
గ్రావిట్ తెల్లవారుజామున నందినిని కలవడానికి వచ్చాడు. ఆపై అక్కడ నుంచి ఇద్దరూ దూకేశారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.