బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (16:00 IST)

భారీ శబ్దాలతో ఉలిక్కిపడిన సిలికాన్ వ్యాలీ (బెంగుళూరు)

దేశంలో సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దాలు సంభవించడంతో ప్రజలను హడలెత్తించాయి. ఇలాంటి శబ్దాలే గత యేడాది కూడా వినిపించగ, శుక్రవారం కూడా అలాంటి పెద్ద శబ్దాలే మరోసారి వినిపించాయి. దీంతో ప్రజలు భయకంపితులైపోయారు. 
 
బెంగళూరు దక్షిణంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ శబ్దం ధాటికి పలు భవనాల్లో అద్దాలు భళ్లున పగిలిపోయాయి. బొమ్మనహళ్లి, సిల్క్ బోర్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, పద్మనాభ నగర్, మహదేవపుర వంటి ప్రాంతాల్లో ఈ పెను శబ్దం వినిపించింది.
 
అప్పట్లో ఇలాంటి శబ్దమే వినిపించగా, యుద్ధ విమానాలు సృష్టించే సోనిక్ బూమ్ అని భావించారు. అది తమ సూపర్ సోనిక్ విమానం నుంచి వచ్చిన ధ్వని అని భారత వాయుసేన వెల్లడించింది.
 
తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ భారీ శబ్దం వినిపించగా, ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఈసారి వచ్చిన శబ్దంపై బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్పందిస్తూ, అందుకు తమ విమానాలు కారణం కాదని స్పష్టం చేసింది.