ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (14:25 IST)

భార్యేమో స్కూల్ టీచర్.. అబ్బే లాభంలేదు.. మోడల్‌తో అఫైర్.. హత్య..

దేశంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య పెరిగిపోతోంది. భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని భావించిన ఓ దుర్మార్గపు భర్త.. ఆమెను ప్రియురాలితో కలిసి హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంజీత్ (38), సునీత(38) అనే దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది, వీరికి ఒక కూతురు (16), కుమారుడు (10) ఉన్నారు. 
 
గత రెండేళ్ల పాటు మంజీత్ మోడల్ ఏంజెల్‌తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ వ్యవహారం తీరా భార్యకు తెలియరావడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. ఎలాగైనా తన భార్యను చంపేయాలని ప్రియురాలితో ప్లాన్ చేశాడు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను.. ఉద్యోగానికి వెళ్తుండగా, సోమవారం మూడు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. 
 
ఈ ఘటనలో సునీత అప్పటికప్పుడే మృతి చెందింది. దీనిపై మృతురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోడల్ అయిన ఏంజెల్‌తో కలిగిన వివాహేతర సంబంధమే భార్యను హతమార్చేలా చేసిందని పోలీసులు తెలిపారు.