బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (11:03 IST)

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై ఆటో డ్రైవర్ అత్యాచారం..

బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని తొమ్మిది సంవత్సరాల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం పోలీస్‌స్టేషన

బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని తొమ్మిది సంవత్సరాల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే ఓ మహిళ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఆరేడేళ్లుగా ఆ ఇంటికి సమీపంలో నివాసముండే నర్సింగ్‌ అనే ఆటో డ్రైవర్‌ ఆటోలోనే కూరగాయలను తీసుకువస్తుంటారు. 
 
మూడు రోజుల క్రితం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ మహిళ బోయినపల్లి సీతారాంపురం వారాంతపు మార్కెట్‌లో తనకు డబ్బులు రావాల్సి ఉండడంతో తన తొమ్మిదేళ్ల కుమార్తెను తీసుకొని నర్సింగ్‌ ఆటోలో వెళ్లారు. నిందితుడిపై నమ్మకంతో తన కుమార్తెను ఆటోలోనే కూర్చోబెట్టారు. ఆమె లేని సమయం చూసి దురాగతానికి పాల్పడ్డాడు. పలు కారణాలతో ఆలస్యంగా ఆ మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.