శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (15:08 IST)

రిపబ్లిక్ డే.. మోడీతో పాటు కోర్టుల్ని టార్గెట్ చేయనున్న ఐసిస్.. పటిష్ట భద్రత

జనవరి 26.. రిపబ్లిక్ డే వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో దేశంలో తీవ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఢిల్లీలోని

జనవరి 26.. రిపబ్లిక్ డే వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో దేశంలో తీవ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఢిల్లీలోని కోర్టులపై దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకల కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
 
కొద్ది రోజుల పాటు ఎవరి కంట పడకుండా ఢిల్లీలో మకాం వేసిన ఐఎస్ ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చునని ఇంటలిజెన్స్ ఇప్పటికే హెచ్చరించింది. కానీ తాజాగా తమ లక్ష్యాన్ని మార్చుకున్న ఉగ్రమూకలు.. కోర్టులతో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. ఢిల్లీ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు.