శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకివ్వాలి : వరుణ్ గాంధీ

పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎన్

పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలంటూ ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. 
 
ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని వరుణ్ సూచించారు. హామీలు నెరవేర్చని ప్రజా ప్రతినిధులను అభిశంసన తీర్మానం ద్వారా తప్పించే అవకాశం లభిస్తే 75 శాతం మంది ఎంపీలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. 
 
ఇకపోతే, తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినని గుర్తు చేశారు. ఇంటి పేరు ఏదైనా ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు.