ప్రపంచం ముందు తల దించుకున్న పాక్, పాకిస్తాన్ ప్రజలను తట్టి లేపుతున్న నరేంద్ర మోదీ....
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నక్కి భారతదేశంలోకి చొరబడి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్ర రాక్షసుల శిబిరాలపై భారతదేశం దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... తమ వ
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నక్కి భారతదేశంలోకి చొరబడి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్ర రాక్షసుల శిబిరాలపై భారతదేశం దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... తమ వైపు నుంచి ఉగ్రవాదులు రావడంలేదంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దేశం ఇప్పుడు ప్రపంచానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది.
పైకి తాము చేతకాని దద్దమ్మలం కాదని అంటున్నప్పటికీ భారతదేశానికి అంతర్జాతీయంగా మద్దతు ఉన్నదన్న సంగతి తెలిసి మైండ్ బ్లాంకై దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మొన్న ఐక్యరాజ్య సమితిలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాశ్మీర్ తమదేనంటూ గట్టిగా ప్రకటించడంతో ఇక పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరులో నక్కిన ఉగ్రవాదుల ఆటకట్టేనని తేలిపోయింది.
భారతదేశం వీలున్నప్పుడల్లా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని మొత్తం తన అధీనంలోకి తీసుకునే అవకాసాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే పాకిస్తాన్ తనంతట తానుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ఉగ్రవాదులను ఏరివేస్తే సరి. లేదంటే ఆ పని భారతదేశం చేస్తూ అలా చొచ్చుకుని ముందుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
ఇకపోతే ఇప్పటికే భారతదేశ ప్రధానమంత్రి పాకిస్తాన్ పాలకులకు సవాల్ విసిరారు. పాకిస్తాన్ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండటానికి ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపకపోవడమేనని చెప్పేశారు. అభివృద్ధిలో, అక్షరాస్యతలో పోటీపడదాం రండి అని కూడా పిలుపునిచ్చారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే పాకిస్తాన్ వెనకబడటానికి కారణం ఏమిటి అంటూ పాక్ ప్రజలు ఆలోచింపచేసే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశం తీసుకుంటున్న చర్యలు కూడా పాకిస్తాన్ పౌరులపై కాదన్న సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.