పాకిస్థాన్‌పై బాంబుల వర్షం కురిపించి... కుల్‌భూషణ్‌ను తీసుకురండి : ప్రవీణ్ తొగాడియా
భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు గూఢచర్య కేసులో పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్షను విధించడాన్ని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా మండిపడ్డారు.
భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు గూఢచర్య కేసులో పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్షను విధించడాన్ని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా మండిపడ్డారు. జాదవ్‌కు ఉరిశిక్షను అమలు చేయకుండా భారత్ చేస్తోన్న వినతులను పాక్ తోసిపుచ్చడంపై ఆయన మండిపడ్డారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ఎక్కడో వాషింగ్టన్‌కు 10 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బాంబు వేసిందని, కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌పై భారత్ బాంబులు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.