శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (08:48 IST)

అగ్ని క్షిపణి 5 సక్సెస్ : చైనాకు వెన్నులో వణుకు

భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) అగ్ని క్షిపణి 5ను విజయవంతంగా ప్రయోగించింది. అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణి ప్రయోగంతో ఇటు పాకిస్థాన్‌తో పాటు అటు చైనా దేశాలకు వెన్నులో వణుకు మొదలైంది.

భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) అగ్ని క్షిపణి 5ను విజయవంతంగా ప్రయోగించింది. అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణి ప్రయోగంతో ఇటు పాకిస్థాన్‌తో పాటు అటు చైనా దేశాలకు వెన్నులో వణుకు మొదలైంది. 
 
5వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ధ్వంసం చేసే సామర్థ్యం గల ‘అగ్ని-5’ క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడంతో నిపుణులు, పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం ఒడిసాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. భారత అమ్ములపొదిలో ఇంత వరకూ ఉన్న క్షిపణుల్లో ఇది అత్యంత సామర్థ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఈ క్షిపణి చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలకు చేరుకోగలదు. అగ్ని-5 దాదాపు ఆసియాతో పాటు, యూరప్‌లోని 70 శాతం భూభాగాన్ని తన పరిధిలోకి తెచ్చుకుందన్న మాట. చైనాలోని ఉత్తరప్రాంతం మొత్తం ఇప్పడు భారత్‌ క్షిపణి పరిధిలోకి వచ్చేసింది. కాగా ఈ క్షిపణిని ప్రవేశపెట్టిన అనంతరం భారత్‌ ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే సరసన చేరింది.
 
భారీ అణు సామర్థ్యం కలిగిన ఈ అగ్ని-5 చైనాలోని చాలా ప్రాంతాలను భస్మీపటలం చేయగలదు. దీని సామర్థ్యం 5,000 కిలోమీటర్లు. క్షిపణి పొడవు 17 మీటర్లు. అణు సామర్థ్యం కలిగిన అగ్ని- 5 క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.