శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (15:01 IST)

బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దు : పాక్‌కు ఐఏఎఫ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు భారత వాయుసేన అధిపతి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వార్నింగ్ ఇచ్చారు. బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దంటూ హెచ్చరించారు. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం. 
 
పీవోకే వెంబడి చొరబాట్లను ఆపకపోతే.. బాలాకోట్ పునరావృతమవుతుందని పాక్‌ను హెచ్చరించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రొమో వీడియో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో యుద్ధం చేసేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందన్నారు. 
 
నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు తెలపడంతో.. భారత సైన్యం అప్రమత్తమైంది. నాలుగు వేల మంది శిక్షణ పొందినట్టు కేంద్ర నిఘా బృందం గుర్తించింది. పీవోకే పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.