శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన నవీన్ తల్లిదండ్రులకు ప్రధాని మోడీ ఫోన్

రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోను చేశారు. నవీన్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
మరోవైపు, నవీన్ మృతిపట్ల కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సేనలు చేస్తున్న బాంబు దాడుల్లో కర్నాటక రాష్ట్రానికి నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ అధికారింగా ప్రకటించింది. దీంతో నవీన్ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.