శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (09:25 IST)

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం... పైలెట్లపై చర్య

indigo plane
కోల్‌కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొన్నాయి. పార్కింగ్ చేసివున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ రెక్కలను తగులుతూ ఇండిగో విమానం వెళ్లింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలెట్లను విధులకు దూరం చేసింది. 
 
చెన్నై వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇండిగో విమానం ఒకటి వచ్చి ఢీకొట్టింది. ఈ విమానం అపుడే ల్యాండింగ్ అయి పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ విమానం రెక్కలను తగులుతూ వెళ్లిందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటన తర్వాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అధికారులతో ఈ విషయమై నిరంతరం టచ్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు.