బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (21:21 IST)

అభిషేక్ శర్మ సిక్సర్ల మోత.. 16 బంతుల్లోనే అర్థ సెంచరీ

Abhishek Sharma
Abhishek Sharma
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విజృంభించాడు. భారీ సిక్సర్ల మోత మోగించాడు. 
 
ఫలితంగా ముంబై బౌలర్లు డీలా పడిపోయారు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్‌‌తో 16 బంతుల్లోనే అర్థ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగంగా అర్థ శతకాన్ని నమోదు చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. 
 
అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. అభిషేక్ శర్మ అతన్ని అధిగమించాడు.