శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (11:30 IST)

ఇండోర్ - పాట్నా రైలు ప్రమాదం : 133కు పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు సమీపంలోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 133కు చేరింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు సమీపంలోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 133కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైు.. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. యూపీ పోలీసులు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 
 
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. కాగా, ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో నేడు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటన చేయనున్నారు.