మహాద్భుతానికి శ్రీకారం చుట్టనున్న ఇస్రో.. ఒకేసారి 83 ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఉపగ్రహాల ప్రయోగానికి తేదీ ఇంకా ఖరారు కానప్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఉపగ్రహాల ప్రయోగానికి తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. వీటి బరువు 500 కేజీలు. మూడు మాత్రం మన దేశ ఉపగ్రహాలు. ఇవి కార్టోశాట్ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్‌ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు.
ఈ యేడాది జూన్‌లో ఇస్రో రికార్డు సృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. అంతకుముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది ఐదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.