ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (16:22 IST)

వాడివేడిగా సమావేశం.. మధ్యలో పోర్న్ క్లిప్పింగ్స్... విస్తుపోయిన లేడీ ఆఫీసర్లు

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉన్న ఆ రాష్ట్ర సచివాలయంలో వాడివేడిగా జరుగుతున్న సమావేశంలో పోర్న్ వీడియో క్లిప్పింగ్స్‌ ప్రదర్శితమయ్యాయి. వీటిని చూసిన మహిళా అధికారులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌లో ఉన్న సచివాలయం, ఎన్.ఐ.సి గదిలో ఆ రాష్ట్ర ఆహారపు శాఖపై సమీక్షను శాఖ కార్యదర్శి ముగ్ధా సింగ్ చేపట్టారు. ఇందులో 10 మంది అధికారులు హాజరుకాగా, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా 33 జిల్లాలకు చెందిన ఆ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. 
 
ఈ సమావేశం మధ్యలో సివిల్ సప్లైస్ అధికారులు ఓ వీడియోను ప్రదర్శించారు. అపుడు ఓ పోర్న్ వీడియో ఒకటి ప్రదర్శితమైంది. దీంతో కార్యదర్శితో పాటు.. ఇతర అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై ముగ్ధా సింగ్ స్పందిస్తూ, దీనికి బాధ్యులు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఎన్.ఐ.సి డైరెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ముగ్ధా సింగ్ తెలిపారు.