బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (17:35 IST)

జయమ్మ ఎస్టేట్ వాచ్‌మెన్.. కారు డ్రైవర్ మృతి.. వరుస హత్యలపై ఫ్యాన్స్ ఆందోళన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట అనే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో సందిగ్ధత, అన్నాడీఎంకేలో చీలిక, చిన్నమ్మ జైలు శిక్ష, దినకరన్ అరెస్ట్ వంటి ఎన్నో ఘటనలు జరుగుతూనే వున్నాయి. తా

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట అనే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో సందిగ్ధత, అన్నాడీఎంకేలో చీలిక, చిన్నమ్మ జైలు శిక్ష, దినకరన్ అరెస్ట్ వంటి ఎన్నో ఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా అమ్మకు సన్నిహితులైన వారు ఒక్కొక్కరిగా మరణించడం.. అమ్మ మద్దతుదారుల్లో బీపీని పెంచుతోంది. 
 
మొన్నటికి మొన్న కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్యకు గురైతే.. తాజాగా అమ్మకు గతంలో కారు డ్రైవర్ కనకరాజ్ కూడా అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇతడు గతంలో చిన్నమ్మపై విమర్శలు గుప్పించాడు. శశికళ అమ్మకు ఎవరైనా దగ్గరైతే సహించేది కాదని, అమ్మ ఎవరినైనా పలకరిస్తే వారిని వేధించేదని కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో కనకరాజ్ హత్యకు గురికావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీంతో అమ్మ ఎస్టేట్‌లో కొనసాగుతున్న వరుస హత్యలపై ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
పోయెస్‌గార్డెన్‌లో పనిచేసిన కనకరాజును 2011లో ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత అతడు ఎక్కడా కనిపించలేదు. తాజాగా బంధువుల ఇంటికి ద్వికచ్రవాహనంపై వెళుతున్న కనకరాజును ఎదురుగా వస్తున్న ఓ కారు బలంగా ఢీకొనడంతో తీవ్రగాయాలతో కనకరాజ్ మరణించాడు.