చైన్ స్నాచర్ దాడిలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. రూ.కోటి పరిహారం ప్రకటించిన జయలలిత!
తమిళనాడు సీఎం జయలలిత తన ఉదారత చాటుకున్నారు. చైన్ స్నాచర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. చైన్ స్నాచర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ హెడ
తమిళనాడు సీఎం జయలలిత తన ఉదారత చాటుకున్నారు. చైన్ స్నాచర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. చైన్ స్నాచర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మునుస్వామి మృతికి అనంతరం ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని కుమార్తె రక్షణ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
కాగా ఈ నెల 15వ తేదీన చైన్ స్నాచర్లు నగలు దోచుకెళ్తుండగా ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ మున్నుస్వామి, మరో కానిస్టేబుల్ ధన్‌పాల్ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎదురు తిరిగిన చైన్‌స్నాచర్లు పోలీసులపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మున్నుస్వామి మరణించాడు.
మునుస్వామి మరణం సమయంలో తమిళనాడు సర్కారు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటిచింది. అయితే తదనంతరం తమిళనాడు సీఎం జయలలిత మునుస్వామి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని అందజేస్తుందని ప్రకటించి.. అమ్మ మనస్సును చాటుకున్నారు. అంతేగాకుండా... రూ.కోటి పరిహారం కేవలం మునుస్వామి కుటుంబానికే పరిమితం చేయలేదు. ఇక నుంచి ఏ పోలీసు సిబ్బంది అయినా విధులు నిర్వహిస్తూ మరణిస్తే వారికీ రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు కొత్త ఆదేశాలు జారీ చేస్తామని జయమ్మ తెలిపారు.