శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:15 IST)

అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి ... శశికళ - దినకరన్‌లను గెంటేశారు

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లను పార్టీ పదువుల నుంచే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించారు. అదేసమయం

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లను పార్టీ పదువుల నుంచే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించారు. అదేసమయంలో జయలలిత అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ ఈ సమావేశంలో తీర్మానించారు. 
 
మంగళవారం ఉదయం పార్టీ సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి మాట్లాడుతూ... భౌతికంగా అమ్మ దూరమైనా, పార్టీకి సంబంధించినంత వరకూ ఆమే శాశ్వత ప్రధాన కార్యదర్శని అని ప్రకటించారు. అలాగే, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ పార్టీ ఆర్గనైజర్‌గా నియమించామని, ఆయన నేతృత్వంలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు.
 
అంతేకాకుండా, అమ్మ గతంలో నియమించిన వారు తమ తమ పదవుల్లో కొనసాగుతారన్నారు. శశికళ, దినకరన్‌లకు పార్టీలో కొనసాగే అర్హత లేదన్నారు. కాగా, ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ అధ్యక్ష పదవిని మరెవరికీ కేటాయించకుండా, జనరల్ సెక్రటరీ పదవిలో జయలలిత కొనసాగుతూ, పార్టీని నడిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి తరువాత ఆ పదవిని మరొకరికి కేటాయించరాదని నిర్ణయించామని పళనిస్వామి స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో శశికళ శకం ముగిసినట్టేనని తెలిపారు. 
 
మరోవైపు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళను అన్నాడీఎంకే నుంచి సాగనంపుతూ ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జయలలిత స్థానంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పీఠం దక్కించుకున్న శశికళను ఆ పదవి నుంచి దించేసింది. శశకళతో పాటు ఆమె జైలుకెళుతూ డిప్యూటీ చీఫ్‌గా నియమించిన దినకరన్‌ను సైతం పార్టీనుంచి బహిష్కరించారు. 
 
ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సర్వసభ్య సమావేశం రద్దు చేసింది. దీంతో శశికళ వర్గం అలియాస్ ‘‘మన్నార్‌గుడి మాఫియా’’కి అన్నాడీఎంకే చెక్ పెట్టినట్టయింది. ఈ లక్ష్యంతోనే జయలలిత నమ్మినబంటుగా పేరున్న పన్నీర్‌సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. పళని స్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మంగళవారం మొత్తం ఆరు కీలక తీర్మానాలను ఆమోదించింది.