సంబంధిత వార్తలు
- Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది
- Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్
- శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్
- భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు
- హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్
Sai Srinivas, Anupama
మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి అనే టైటిల్ మిస్టరీని, మైథాలజీ గ్రాండియర్ ని సూచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఎక్సయిటింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు.
చేతుల్లో జ్వాలలు పట్టుకుని, బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ ఇద్దరూ అడవిలో ఏదో వెతుకుతున్నట్లు కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో ఒక బంగ్లా కనిపిండం థ్రిల్లింగ్ వైబ్ ని పెంచుతోంది. టైటిల్, పోస్టర్ రెండూ అంచనాలను పెంచడంలో విజయవంతమయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఏప్రిల్ 29న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ చిత్రానికి చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, సంగీతం సామ్ సిఎస్ సమకూర్చారు. ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ దత్ నిర్వహిస్తున్నారు, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటర్. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, సహ రచయిత దరాహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్ కె బాల గణేష్.
