1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (10:36 IST)

మా పెద్దమ్మను హత్య చేశారు: జయలలిత సోదరి కుమార్తె ఆరోపణ

తమ పెద్దమ్మ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితది సహజమరణం కాదని... ఆమెను హత్య చేశారనీ జయలలిత సోదరి కుమార్తె అమృత ఆరోపిస్తున్నారు. అందువల్ల తమ పెద్దమ్మ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని

తమ పెద్దమ్మ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితది సహజమరణం కాదని... ఆమెను హత్య చేశారనీ జయలలిత సోదరి కుమార్తె అమృత ఆరోపిస్తున్నారు. అందువల్ల తమ పెద్దమ్మ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై అనేకమంది పలు రకాలైన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అమృత కూడా స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... పెద్దమ్మను కనీసం కలుసుకోవడానికి కూడా వీలులేకుండా శశికళ తమను దూరం పెట్టారని ఆరోపించారు. తమ పెద్దమ్మ అంత్యక్రియలను ఈ రకంగా చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీరంగపట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, ఆమె బంధువులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు.