ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:56 IST)

కంచి మఠం 70వ పీఠాధిపతిగా శంకర్ విజయేంద్ర సరస్వతి?

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం ఉదయం మహాసమాధి అయ్యారు. ఆయనకు వయసు 83 యేళ్లు. గత కొంతకాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన... బుధవారం ఉదయం కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం ఉదయం మహాసమాధి అయ్యారు. ఆయనకు వయసు 83 యేళ్లు. గత కొంతకాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన... బుధవారం ఉదయం కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. 
 
కాగా, ఈయన పూర్తి అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యార్. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఇరునీకల్ గ్రామంలో జన్మించారు. 1954 మార్చి 22న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. 
 
రెండు దశాబ్దాల క్రితం చంద్రశేఖరేంద్ర సరస్వతి మరణంతో జయేంద్ర సరస్వతికి కంచి పీఠం బాధ్యతలు దక్కాయి. ఇప్పుడు జయేంద్ర సరస్వతి కీర్తిశేషులు కావడంతో కంచి కామకోటి పీఠం తదుపరి పీఠాధిపతిగా జూనియర్‌గా ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి నియమితులైనట్లు తెలుస్తోంది. 
 
కంచి పీఠాధిపతి మహాసమాధిపై కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్‌లో తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.