గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (09:56 IST)

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు : ఓట్ల లెక్కింపు ప్రారంభం... వెనుకంజలో బీజేపీ

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు అఖరి ఫలితం వెలువడనుంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశల్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 
 
మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న, రెండో దశలో 20 స్థానాలకు డిసెంబర్ 7న, మూడో దశలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో దశలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, ఐదో దశలో 16 స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 42 ఎమ్మెల్యేలు అవసరం. 
 
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీజేపీలు నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు.. జేఎంఎం - కాంగ్రెస్ కూటమి 35 చోట్ల, బీజేపీ 34 చోట్ల, ఇతరులు ఏజేఎస్‌యూ 4, ఇతరులు 12 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.