శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2016 (13:28 IST)

అసెంబ్లీలో మేం ఐదుగురం పంచపాండవులం.. కౌరవుల్ని ఎదుర్కొంటాం: లక్ష్మణ్

బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారని గుర్తు చేసిన లక్ష్మణ్.. అసెంబ్లీ మేం ఐదుగురం పంచపాండవులని అభివర్ణించారు. పంచపాండవుల తరహాలో ధర్మం పక్షనా నిలబడతామన్నారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికార పార్టీ కౌరవ సేనను తయారు చేస్తోంది. ఆ కౌరవ సేనను పాండవుల్లా ఎదుర్కొంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్‌ నేతల సలహాలు తీసుకుంటూ తెలంగాణలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామన్నారు. 
 
ప్రజల పక్షాన ఉండి పోరాడతామని, తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ అజెండా అనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. ‘‘ఉద్యమ కాలంలో, ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, వాటి అమలుకు ప్రయత్నం చేయడం లేదని వెల్లడించారు.