కన్నడం రాదా...? ఐతే మీపై లైంగిక దాడి తప్పదు... ఇద్దరి మహిళలపై...
కన్నడం మాట్లాడటం రాకపోతే మీపై లైంగిక దాడి తప్పదంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది. ఉత్తర బెంగళూరులో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి వెళుతోంది. వారిని వెంబడించ
కన్నడం మాట్లాడటం రాకపోతే మీపై లైంగిక దాడి తప్పదంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది. ఉత్తర బెంగళూరులో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి వెళుతోంది. వారిని వెంబడించిన నలుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. వారిలో ఒకరు... మీరు కన్నడలో ఏదైనా మాట్లాడండి అంటూ అడిగాడు.
ఐతే వారేమీ మాట్లాడకపోవడంతో వారు స్థానికులు కాదని తేల్చుకున్న నలుగురూ వ్యక్తులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కర్నాటకలో వుంటూ కన్నడంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కన్నడంలో మాట్లాడనందుకు ఇద్దరూ కలిసి మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాలని, లేదంటే లైంగిక దాడి తప్పదని వేధించారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.