డబ్బు కోసం అకృత్యాలు.. కొత్త జంట పడకగది దృశ్యాలను చిత్రీకరించి..?
డబ్బు కోసం మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు కోసం ఎలాంటి పనుల కైనా సిద్ధపడుతున్నారు యువత. తాజాగా ఓ కొత్తగా పెళ్లైన జంట పడకగది శృంగార దృశ్యాలు పోర్న్ వెబ్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారిద్దరి షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాం పట్టణంలో చోటుచేసుకుంది. నెలరోజుల కిందట పెళ్లయిన ఓ జంట అదే పట్టణంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండసాగారు. వారి పొరుగింట్లోనే ఉండే అనీల్ అనే యువకుడి కన్ను వారిపై పడింది.
వారి పడకగది దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ ఉండేవాడు. పొరుగున ఉన్నవారే కావడంతో అతని ఆకృత్యానికి అడ్డు లేకుండా పోయింది. తరచూ అతను దంపతుల బెడ్‌రూమ్ దృశ్యాలను తన కెమెరాలో బంధించేవాడు. గతవారం కూడా అనిల్ కిటికీ గుండా తన మొబైల్ ఫోన్ ద్వారా అదే పని చేస్తుండటాన్ని చూసిన ఆ దంపతులు అతడిని పట్టుకున్నారు.
కానీ మొబైల్ ఫోన్ నిండా సెక్స్ టేపులు, వీడియో క్లిప్పింగులే కనిపించాయి. వాటిని పోర్న్ వెబ్ సైట్లలో పెట్టి డబ్బు చేసుకుంటున్నాడని గమనించాడు. దీంతో రత్నాకర్ నిందితుడు అనిల్‌ను బంధించి, పోలీస్‌స్టేసన్‌లో అప్పగించారు. తమ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.