సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (13:39 IST)

వెయ్యి రూపాయల అప్పు.. తిరిగి ఇవ్వలేదని.. అత్యాచారం.. నిందితుడికి?

కరోనా వైరస్ కారణంగా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్ల క్రితం తమిళనాడులో అప్పుగా తీసుకున్న రూ.వెయ్యి తిరిగి ఇవ్వలేదని. సదరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు విచారణ సందర్భంగా మరణించగా.. ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి 34 ఏళ్ల శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది తమిళనాడు కోర్టు. 
 
వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లాకు చెందిన ఓ మహిళ 2010 ఏప్రిల్‌ 4న శివకుమార్‌ అనే వ్యక్తి వద్ద రూ.1000 అప్పు తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమె అప్పు తీర్చకపోవడంతో ఆమెను వేధింపులకు గురిచేసిన శివకుమార్.. అదే, ఆసరాగా తీసుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మబలికాడు. 
 
నిర్మాత రమ్మంటున్నాడని నమ్మించి.. మహిళను తన షాపు దగ్గరకు రప్పించాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఆ దారుణాన్ని రవి అనే వ్యక్తి సహకారంతో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.