శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (20:25 IST)

ప్రేమలో పడింది... అలా కలిశారు... పేరెంట్స్‌కి ఆ చిత్రాలు చూపించింది...

ఇటీవలి కాలంలో తక్కువ వయసున్న అబ్బాయిలతో ఎక్కువ వయసున్న యువతులు ప్రేమాయణం సాగిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే కర్నాటక రాష్ట్రంలోని తిలక్ నగర్ లో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల య

ఇటీవలి కాలంలో తక్కువ వయసున్న అబ్బాయిలతో ఎక్కువ వయసున్న యువతులు ప్రేమాయణం సాగిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే కర్నాటక రాష్ట్రంలోని తిలక్ నగర్ లో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి ప్రేమిస్తున్నానంటూ దగ్గరైంది. ఈ క్రమంలో ఇద్దరూ లైంగికంగా ఒకటయ్యారు. 
 
ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దాంతో ఆమె 17 ఏళ్ల బాలుడిని తనను వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. ఆ బాలుడు ససేమిరా అనడంతో ఇద్దరూ అసభ్యకర రీతిలో కలిసి వున్న వీడియోను చూపించి బెదిరింపులకు పాల్పడింది. అంతేకాదు... విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా ఆ వీడియోను తీసుకుని వెళ్లి ఏకంగా బాలుడి తల్లిదండ్రుల ముందు పెట్టి పంచాయతీ పెట్టారు. 
 
తమ కుమార్తెను పెళ్లాడాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. ఈ పరిణామంతో బాలుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. విషయం బయటపడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలుడు, యువతిలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.