బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (09:16 IST)

ప్రియురాలితో లాడ్జిలో ఎంజాయ్ చేసేందుకు డాన్‌కు ఖాకీల సహకారం

romance
కర్నాటక రాష్ట్రంలో అండర్ వరల్డ్ డాన్‌గా బచ్చాఖాన్‌ తన ప్రియురాలితో లాడ్జిలో శృంగారంలో పాల్గొనేందుకు పోలీసులు తమవంతు సహకారం అందించారు. బచ్చాఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత నేరుగా జైలుకు తరలించాల్సిన ఎస్కార్ట్ పోలీసులు.. బచ్చాఖాన్ ప్రియురాలు బసచేసిన లాడ్జీకి నిందితుడైన అండవర్ వరల్డ్ డాన్‌ను తరలించారు. ఈ విషయం హబ్బళ్లి - ధారవాడ పోలీస్ కమిషనర్‌కు తెలియడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బచ్చాఖాన్ ఓ అండర్ వరల్డ్ డాన్‌గా చెలామణి అవుతున్నాడు. ఈయన వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్డర్ సుబ్బారెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ నిమిత్తం బళ్ళారి జైలు నుంచి ధారవాడ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత బచ్చాఖాన్‌ను నేరుగా కోర్టుకు తరలించాల్సివుంది. కానీ, పోలీసులు ఆ పని చేయలేదు. 
 
మార్గమధ్యంలో ఓ లాడ్జిలో బస చేసివున్న ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు బచ్చాఖాన్‌ను పంపించారు. దీంతో ప్రియురాలితో బచ్చాఖాన్ శృంగారంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని హుబ్బళ్ళి - ధారవాడ పోలీస్ కమిషనర్‌కు చేరింది. దీంతో భారీ బందోబస్తుతో అక్కడకు వచ్చిన పోలీసులు బచ్చాఖాన్, ఆయన ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.