గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అనుమాన భూతం... గొంతుపై కాలుతో తొక్కి భార్యను చంపేశాడు..

కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో భార్య గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కాలనీకి చెందిన సౌమ్య(30), రవి అనే దంపతులు ఉన్నారు. వీరికి 11 యేళ్ళ క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెతో అనేకసార్లు గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.
 
కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. ఆదివారం నిద్రపోయిన సమయంలో భార్య గొంతుపైన రవి కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తర్వాత ఇంటి నుంచి పరారైనాడు. 
 
సోమవారం ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.