సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి... కర్ణాటకలో రాజకీయ సంక్షోభం
కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బుధవారం రోజంతా భారీ కసరత్తు జరిపింది. ముఖ్యమంత్రి స
కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బుధవారం రోజంతా భారీ కసరత్తు జరిపింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆపై మాజీ ప్రధాని దేవేగౌడతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని దేవేగౌడ స్వయంగా సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. వీరంతా కలిసి తమిళనాడుకు చుక్కనీరు కూడా వదలవద్దని హితవు పలికారు.
పైగా, శాసనసభను తక్షణం సమావేశపరచాలని సూచించారు. ఆ తర్వాత బుధవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో అఖిలపక్ష భేటీలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలకూ ఆమోదముద్ర వేశారు. 24న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచనున్నారు. అంతవరకు తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకూడదని మంత్రిమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శనివారం జరగనున్న అసెంబ్లీ అత్యవసర సమావేశంలోనూ చర్చ జరిపి తమిళనాడుకు కావేరీ నీటి విడుదల సాధ్యం కాదంటూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించనున్నారు.
తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో రాష్ట్ర నేతలంతా కలసికట్టుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లి ఈ సంక్షోభంపై వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మాత్రం అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించింది.