ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (13:01 IST)

త్వరగా శ్రీమంతురాలు కావాలని నిత్యపెళ్లి కుమార్తెగా మారిన కిలేడీ...

woman
కర్నాటక రాష్ట్రంలో దావణగెరెలో ఓ మహిళ త్వరగా శ్రీమంతురాలిని కావాలన్న లక్ష్యంతో నిత్య పెళ్లి కుమార్తెగా మారింది. ఇందుకోసం ఆమె ఏకంగా నలుగురిని వివాహం చేసుకుంది. ఆమె పేరు స్నేహ (25). ఆమెను దావణగెరె పోలీసులు అరెస్టు చేశారు. వారు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండ్య జిల్లా పాండవపురకు చెందిన స్నేహ.. రెండేళ్ల క్రితం రైలులో ప్రయాణం చేస్తుండగా, ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా దారితీసి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత దావణగెరెలో ఇంట్లో కాపురం పెట్టింది. ఈ క్రమంలో తాను గర్భందాల్చినట్టు చెప్పి రెండు నెలల క్రితం పుట్టింటింకి వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ ఫోన్ చేసి తన వద్దకు రావాలని స్నేహను పలుమార్లు బతిమిలాడారు. కానీ, ఆమె రాలేదు. దీంతో ఆయన తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... స్నేహ కోసం గాలింపు చర్యలు చేపట్టి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
స్నేహ అప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నట్టు తెలిపింది. ప్రశాంత్ తనకు మూడో భర్త అని చెప్పడంతో అతను నిర్ఘాంతపోయాడు. ప్రశాంత్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత బెంగుళూరుకు చెందిన రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. అంతకుముందే ఆమె మహేశ్‌ను ఆ తర్వాత వెంకటేశ్‌ అనే వారిని పెళ్లి చేసుకుంది. ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్నేహ గుట్టు వెలుగుచూసింది.