శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (12:00 IST)

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య సేవలు కొనసాగుతున్నాయని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు చికిత్స అందించాల్సి ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారమే తన ఇద్దరు కుమారులైన ఎంకే అళగిరి (పెద్ద కుమారుడు), ఎంకే స్టాలిన్ (చిన్న కుమారుడు)లను గోపాలపురంలోని తన నివాసానికి పిలిపించి.. మంతనాలు జరిపిన విషయం తెల్సిందే. దీంతో కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు... డీఎంకే శ్రేణులు సైతం ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ కలయిక జరిగి కొన్ని గంటలకు గడువకముందే కరుణానిధి తిరిగి ఆస్పత్రిలో చేరడం గమనార్హం.