మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (20:36 IST)

కూతురుకు బీర్ తాగించిన తండ్రి.. కేరళలో దారుణం

పిల్లలపై ప్రేమతో పాలు ఇవ్వడం మామూలే. కానీ ఇక్కడ ఓ తండ్రి బీర్ కూతురుకు తాగించాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో మాత్రం ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాపించాడు. కానీ బీరు తాగిన బాలిక స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యింది. దాంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
 
వివరాల్లోకి వెళ్తే.. హోస్‌దుర్గ్‌లోని తోయమ్మాల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ ఇంట్లో బీరు తాగుతూ తన ఎనిమిదేళ్ల కూతురుకు కూడా పట్టించాడు. అయితే ఆ బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.
 
బాలిక వాంగ్మూలం ఆధారంగా ఆమె తండ్రి రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి రెండు వారాల జైలుశిక్ష విధించింది. దాంతో పోలీసులు అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు.