ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (09:21 IST)

పెద్దనోట్ల రద్దుపై ప్రధాని ఎందుకు నోరు విప్పలేదు... విపక్షాలు

పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు కష్టాలను అనుభవించారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం నిరుత్సాహరిచింది. పెద్దనోట్ల రద్దుపై టీవీలో ప్రధాని మోదీ ప్రసంగం చాలా న

పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు కష్టాలను అనుభవించారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం నిరుత్సాహరిచింది. పెద్దనోట్ల రద్దుపై టీవీలో ప్రధాని మోదీ ప్రసంగం చాలా నిరుత్సాహకరంగా ఉందని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం, ప్రజల కష్టాలపై మోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 50 రోజుల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని రూపు మాపారో మోదీ ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్‌ అడిగింది. 
 
పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసిందని దీనికి సంబంధించి మోదీ ఏమీ మాట్లాడలేదని పేర్కొంది. చాలా కీలకమైన ప్రశ్నకు మోడీ ప్రసంగంలో సమాధానం చెప్పలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. నోట్ల రద్దు వల్ల దేశంలో 125 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. కోట్లాది మంది తీవ్ర కష్టాలుపడ్డారని.. ప్రధాని తన ప్రసంగంలో వాటిని నామమాత్రం కూడా ప్రస్తావించలేదని విమర్శించారు.
 
నోట్ల రద్దుతో ప్రధాని సన్నిహితులే బాగుపడ్డారని ఆరోపించారు. మోదీ చేసిన ప్రసంగం నిరుత్సాహపరిచిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘మోదీజీ.. ఉత్తమాటలే చెబుతారని తేలిపోయింది. ఆయన ఏది చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. నోట్ల రద్దుతో అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారు’’ అని ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.