శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (16:41 IST)

రైలు పట్టాలపై కొండ చరియలు-సరిహద్దుల్లో రైలు ప్రమాదం

railway
భారీ వర్షాల కారణంగా గోవాలిని ప్రఖ్యాత దూద్ సాగర్ జలపాతం వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండ చరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మంగళూరు నుంచి బయల్దేరిన మంగళూరు- ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు, సోనాలిమ్, దూద్ సాగర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 
 
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జన జీవనం, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. కాగా.. వశిష్టి నది పొంగిపొర్లుతున్న కారణంగా మద్గావ్-లోండా-మిరాజ్ మీదుగా మళ్లించిన సిఎస్‌టి టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్, దుధ్‌సాగర్-సోనౌలిమ్ విభాగంలో పట్టాలు తప్పింది. ఇంజిన్, మొదటి జనరల్ కోచ్ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు.