శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (12:07 IST)

రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీ.. ఎన్డీయే కూటమి తరపున బరిలోకి...?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్కే. అద్వానీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన పేరును భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై చర్చించేందు

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్కే. అద్వానీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన పేరును భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో సమావేశం కానుంది. 
 
నిజానికి తదుపరి రాష్ట్రపతి ఎవరన్న అంశంపై గత కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఢిల్లీ మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇలా అనేక మంది పేర్లు వచ్చాయి. 
 
కానీ, చివరకు బీజేపీ అధిష్టానం ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సమాచారం. సోమవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.