గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (19:43 IST)

మిడతలతో రైతులకే కాదు.. విమానాలకూ ఇబ్బందే..

భారత దేశానికి ఇప్పటికే కరోనాతో తిప్పలు తప్పట్లేదు. ప్రస్తుతం మిడతల బాధ తలుపు తట్టింది. మిడతల కారణంగా భారీగా పంటలు నాశమైన తరుణంలో.. రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. అయితే ఈ మిడతల ద్వారా విమానాలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) తెలిపింది. 
 
మిడతలు తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డీజీసీఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సమయంలో విమానాల్లోని అన్ని ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదముందని తెలిపింది. ఫలితంగా ఎయిర్‌ స్పీడ్‌, అల్టీ మీటర్‌ సూచీలు సరిగా పనిచేయకపోవచ్చని తెలిపింది.
 
ఈ దండు ఎదురుగా వస్తున్నప్పుడు వైపర్లను వేయడం వల్ల మరకలు పడే అవకాశం ఉందని డీజీసీఏ తెలిపింది. అలాగే మిడతల గుంపును గుర్తించినట్లయితే వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వచ్చీపోయే విమానాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
 
విమాన సిబ్బంది కూడా ఈ సమాచారాన్ని పరస్పరం ఇతర సిబ్బందితో పంచుకోవాలని సూచించింది. రాత్రివేళ్లలో ఈ గుంపు సంచరించకపోవడమనేది ఊరట కల్పించే అంశమంటూ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.