శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జూన్ 2022 (14:35 IST)

స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన కిరాతకులు

victim
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు తమ స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. పైగా, ఈ విషయాన్న చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. అప్పటి నుంచి గత యేడాదిగా ఆమెను బలవంతంగా అనుభవిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించడంతో పెళ్లి రద్దు అయింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, 2021 జూన్ 2వ తేదీన హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. 
 
ఈ విషయం గురించి బయటకు చెపితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించారని, దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా మౌనంగా ఉన్నట్టు విచారణరో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.